Jani Master : కస్టడీలో జానీ మాస్టర్.. కెమెరాలు చూసి రన్నింగ్

Jani Master : కస్టడీలో జానీ మాస్టర్.. కెమెరాలు చూసి రన్నింగ్
X

హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు అంగీకరించింది. నాలుగు రోజుల పాటు కస్టడీకి ఓకే చెప్పింది. దీంతో.. చంచల్ గూడ రిమాండ్ ఖైదీ జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకుని పోలీస్ జీపులో నార్సింగి తీసుకెళ్లారు పోలీసులు. కోర్టు చెప్పినట్టుగా కౌన్సిల్ సమక్షంలో జానీని ప్రశ్నించనున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే జానీ ఫ్యూచర్ ఏంటో తేలిపోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరోవైపు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విజువల్స్ కోసం ఎదురుచూస్తున్న రిపోర్టర్లను ముఖం చాటేశారు జానీ మాస్టర్. పోలీసులు వెహికల్ దించగానే.. పరుగు పరుగున పోలీస్ స్టేషన్ లోకి మెట్లెక్కి పరుగెత్తారు.

Tags

Next Story