Jason Momoa : పదేళ్ళు డేటింగ్.. నాలుగేళ్ళ క్రితం పెళ్లి.. ఇప్పుడు విడాకులు...!

Jason Momoa : హాలీవుడ్ స్టార్, ఆక్వామెన్ స్టార్ జాసన్ మొమోవా తన భార్య లీసా బోనెట్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. బార్యాభర్తలుగా విడిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 'కాలంతో పాటు వస్తున్న మార్పులను మనమంతా అనుభవిస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురుచూశాం. అందుకు నా కుటుంబం అతీతమేమీ కాదు. మేమిద్దరం విడిపోతున్నాం. కానీ మా మధ్య ప్రేమ అలాగే కొనసాగుతుంది. అది వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది. పిల్లల బాధ్యతను ఇద్దరమూ చూసుకుంటాం' అని పాస్ చేశాడు. కాగా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా జాసన్, లీసాకి జూలై 2005లో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరికి 2007లో లోలా, 2008లో నకోకా వోల్ఫ్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక 2017లో అధికారికంగా వీరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారారు. అయితే పెళ్ళైన నాలుగేళ్ళకే వీరిద్దరూ విడిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com