Jawan Advance Booking : ఆల్ టైమ్ రికార్డ్.. 24 గంటల్లో రూ. 10 కోట్లు
'పఠాన్' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, షారుఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం 'జవాన్'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సెప్టెంబర్ 1న భారతదేశంలో ప్రారంభించబడింది. ఇప్పటికే 1లక్షా 65వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. షారుఖ్ ఖాన్ నటించిన ఈ 'జవాన్'.. మొదటి 24 గంటల్లో ఏ బాలీవుడ్ సినిమాకూ రాని ఆల్-టైమ్ అత్యధిక ప్రీ-సేల్స్ ను నమోదు చేసింది. తొలి 24 గంటల్లో 3లక్షల 5వేల టిక్కెట్లు అమ్ముడవడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ చిత్రం 24 గంటల్లోనే PVR, ఐనాక్స్, సినీపోలిస్‌లలో సుమారు 1లక్షా 65వేల టిక్కెట్లను విక్రయించింది. ఇది పఠాన్ 1లక్షా 17వేల టిక్కెట్ల రికార్డును అధిగమించింది.
ముందస్తు బుకింగ్‌లు ఈ వేగంతో కొనసాగితే, ప్రారంభ రోజు (650K టిక్కెట్‌లు) PICలో అత్యధిక టిక్కెట్‌లను విక్రయించిన SS రాజమౌళి 'బాహుబలి 2' రికార్డును కూడా ఈ చిత్రం అధిగమించవచ్చు. ఇకపోతే అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' చిత్రంలో షారూఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం SRK అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, 'జవాన్'ను గౌరీ ఖాన్ నిర్మించగా, గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే యాక్షన్-ప్యాక్డ్ అతిధి పాత్రలో కనిపించనుంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. ఇటీవల, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. ఇది మాత్రమే కాదు, ట్రైలర్‌ను 20,000 మంది అభిమానులు హాజరైన ఖలీఫా బుర్జ్‌లో కూడా ప్రదర్శించారు.
'జవాన్' లోనే కాకుండా, షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' లోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ద్వయం యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ ఇంతకుమునుపే ప్రకటించారు. ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే మూవీలో కనిపించనుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'పఠాన్' తర్వాత 'జవాన్' లో కనిపిస్తోన్న SRK.. రాజ్‌కుమార్ హిరానీ 'డుంకీ' కూడా లైన్ ప్ లో ఉంది. ఇది డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com