Jawan Collection Day 37: సినిమా దినోత్సవాన రూ.5కోట్లు
అక్టోబర్ 13, శుక్రవారం జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా చాలా థియేటర్లలో టిక్కెట్ ధరలు రూ.99 గా ఉంచారు. దీంతో చాలా మంది తమకిష్టమైన సినిమాలను తక్కువ ధరకే థియేటర్లలో చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇది పలు సినిమాలకు గొప్ప ఊపునిచ్చింది. ఇప్పటికే థియేటర్లలో ఐదు వారాల నుంచి విజయవంతంగా రన్ అవుతున్న షారుఖ్ ఖాన్ 'జవాన్' ఈ మధ్య కాలంలో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అయితే, తాజాగా తీసుకువచ్చిన రూ.99 టిక్కెట్ ధర కారణంగా, ఈ చిత్రం కలెక్షన్స్ లో భారీ పెరుగుదల నమోదైంది.
మార్కెట్ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, 'జవాన్' గత వారం రోజులుగా రోజుకు రూ.70 లక్షల నుండి రూ.80 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అయితే, టికెట్ ధరలను రూ.99కి తగ్గించగా.. ఈ చిత్రం శుక్రవారం రూ.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా దేశీయ నికర వసూళ్లు రూ. 632 కోట్లు, ప్రపంచ బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 1125 కోట్లకు చేరుకుంది.
గత వారం, నిర్మాతలు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1103.27కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ప్రకటించారు. హిందీలో ఈ చిత్రం 560.03 కోట్లు, ఇతర భాషల డబ్‌ల నుండి రూ. 59.89 కోట్లు.. ఇలా ఇప్పటికీ ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో రన్ అవుతోంది అని తెలిపారు.
అయితే అమీర్ ఖాన్ 'దంగల్' రికార్డును మాత్రం ఈ సినిమా ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు వసూలు చేసింది. మూవీ దాని ఆదాయంలో ప్రధాన వాటా చైనా నుండి వచ్చింది. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన 'ఫుక్రే 3', 'మిషన్ రాణిగంజ్' వంటి చిత్రాలు కూడా ఇదే రోజున అధిక ఫుట్‌ఫాల్‌ను చూశాయి. 'ఫుక్రే 3'.. రూ. 5.25 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి, పుల్కిత్ సామ్రాట్ లు కీలక పాత్రలు పోషించారు. అక్షయ్ 'కుమార్ మిషన్ రాణిగంజ్' కూడా శుక్రవారం రూ. 5 కోట్లు రాబట్టింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com