Jawan: 'జవాన్' పై కురిపిస్తోన్న ప్రేమకు షారుఖ్ థ్యాంక్స్ నోట్

'జవాన్' మూవీ గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. 'జవాన్' విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులు 'జవాన్' పై భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, కొన్ని గ్లింప్స్‌తో పాటు సౌత్‌లో 'జవాన్' ఆడియో లాంచ్.. మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. SRK ఈసారి విక్రమ్, ఆజాద్‌గా హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానుల గురించి మాట్లాడుతూ, షారుఖ్ ఖాన్ తన X హ్యాండిల్‌ను తీసుకున్నాడు. 'జవాన్'పై వారు చూపిస్తోన్న ప్రేమకు, ప్రపంచం నలుమూలల నుండి వస్తోన్న అభిమానుల ఆదరణకు ధన్యవాదాలు తెలిపాడు.
చెన్నై నుండి నాందేడ్, జల్గావ్, పెరూ, ఆస్ట్రియా, కెనడా, మిచిగాన్, సింగపూర్, జర్మనీ, సిర్లంక, నేపాల్ లాంటి ఎన్నో నగరాలు, దేశాల్లో అభిమానులు 'జవాన్' విడుదలను ఒక పండుగలా జరుపుకుంటున్నారు. 50 నుంచి 60 అడుగుల ఎత్తులో షారుఖ్ ఫ్లెక్సీలు, పటాకులు కాల్చడం, హెయిర్‌కట్‌లు మొదలైనవాటితో జవాన్ పై, తమ అభిమాన హీరోపై అభిమానానని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫ్యాన్స్ క్లబ్‌లు థియేటర్లలో కేక్‌లు కట్ చేశాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో వేడుకల్లో భాగంగా బాద్ షా అభిమానులు.. తమ చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులపై షారుఖ్ కూడా రిప్లై ఇస్తున్నారు. కొన్ని పోస్టులకు షారూఖ్ చమత్కారంగా సమాధానమిచ్చాడు.
షారూఖ్ ఖాన్ కృతజ్ఞతా నోట్..Thank you for all the love and appreciation for #Jawan!! Stay safe and happy… Please keep sending in the pics and videos of all of you enjoying at the movies…. And I will be back soon to see all of them! Until then… Party with Jawan in the theatres!! Lots of love and…
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023
షారుఖ్ ఖాన్ అభిమానులందరికీ కృతజ్ఞతా నోట్ ను పోస్టు చేశాడు. అందులో అతను వారందరినీ సురక్షితంగా ఉండమని కోరాడు. సినిమా హాళ్లలో జవాన్‌ను ఆస్వాదిస్తున్నప్పుడు తమ వీడియోలు, చిత్రాలను తనకు పంపుతూ ఉండాలని వారిని కోరాడు . తర్వాత సమయంలో వారి మరిన్ని వీడియోలను చూడటానికి తిరిగి వస్తానని ఆయన పంచుకున్నారు. "అప్పటి వరకు జవాన్‌తో థియేటర్లలో పార్టీ చేసుకోండి. బోలెడంత ప్రేమ, కృతజ్ఞతలు" అని SRK.. X లో ట్వీట్ చేసారు.
బాలీవుడ్ లైఫ్ 'జవాన్'కు 3.5 స్టార్ రేటింగ్ ను ఇచ్చింది. షారుఖ్ ఖాన్‌ను ఎంటర్టైన్మెంట్ కా బాప్ అని ప్రశంసించింది. అతను ఆజాద్‌గా బాగానే ఉన్నప్పటికీ, విక్రమ్‌గా అతని పాత్ర విజిల్స్ వేయించేలా ఉంది. 'జవాన్' సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్ మాత్రమే కాకుండా, హాస్యం కూడా ఈ సినిమాలో ఉంది. మొత్తానికి SRK ఎప్పటిలాగే ఈ మూవీనీ ఇరగదీశాడనే చెప్పవచ్చు. అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' ద్వారా నయనతార బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. కాగా ఈ మూవీలో విజయ్ సేతుపతి ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు.
Wow Chief!!! And good going girls!!! Glad to see u all having such a great time!!! Thank u for the love https://t.co/FkAqAdcz7U
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com