ఒక్క పాట కోసం రూ.15కోట్లు..1000 మంది డ్యాన్సర్లు

ఒక్క పాట కోసం రూ.15కోట్లు..1000 మంది డ్యాన్సర్లు
షారుఖ్ 'జవాన్' లోని సాంగ్ కోసం భారీ బడ్జెట్ పెట్టిన మేకర్స్

షారుఖ్ ఖాన్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ 'జవాన్‌'తో వెండితెరపై అలరించేందు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే హై-ఆక్టేన్ ప్రీవ్యూతో ఇంటర్నెట్‌ షేక్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు జవాన్‌లోని మొదటి పాటతో మిలియన్ల మంది అభిమానుల మనస్సులను చెదరగొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. జవాన్ అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ ఈ వారంలో వదులుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పలు నివేదికల ప్రకారం, జిందా బందా అనే జవాన్ లో మొట్టమొదటి ట్రాక్‌ తో షారుఖ్ అభిమానుల్ని మరింత ఉత్సాహపరచాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం,

జవాన్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ .. డైనమిక్ యాక్టర్-డైరెక్టర్ ద్వయం, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, ఏస్ డైరెక్టర్ అట్లీ కుమార్.. జవాన్ లోని మొదటి పాట జిందా బందాను లాంచ్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జవాన్‌ తొలి పాట జిందా బందా!

'జవాన్' సినిమాకు సంబంధించిన పలు నివేదికలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 'జిందా బందా' సాంగ్ కు సంగీత స్వరకర్త అనిరుధ్ స్వరాలు సమకూర్చగా.. SRK అద్భుతమైన ఫర్మామెన్స్ తో ఈ సాంగ్ లో అలరించనున్నారు. అయితే ఈ సాంగ్ కు శోబి కొరియోగ్రాఫర్ గా ఉండగా.. దీన్ని ఐదు రోజుల పాటు చెన్నైలో షూట్ చేసినట్టు సమాచారం, హైదరాబాద్, బెంగళూరు, మదురై, ముంబై నుంచి 1,000 మంది డ్యాన్సర్స్ ఈ సాంగ్ లో పార్టిసిపేట్ చేశారని టాక్. అంతే కాదు ఈ సాంగ్ షూట్ కోసం మేకర్స్ రూ. 15కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం.

కింగ్ ఖాన్ కెరీర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా చిత్ర నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఒక్క పాటకు పెట్టిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమానే తీయొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటిది ఇంత బడ్జెట్ అంటే మాటలు కాదు. అయితే బిజినెస్ పరంగా హక్కులు విక్రయించి ఎప్పుడో విపరీత లాభాలు అందుకున్న రెడ్ చిల్లీస్ బ్యానర్ పబ్లిసిటీని ఓ రేంజ్ లో చేయబోతోంది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, పాటల విడుదల తర్వాత మేకర్స్, షారుఖ్ ఖాన్ కూడా 'జవాన్' కోసం ప్రమోషన్లను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా జవాన్ లో షారుఖ్ ఖాన్ సరసన తమిళ సూపర్ స్టార్లు నయనతార నటించారు. ఆమెతో పాటు ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 7, 2023న హిందీ, తమిళంతో పాటు తెలుగు భాషల్లో విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story