Jawan: షారుఖ్ సినిమాలో ఇళయదళపతి..!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం 'జవాన్ ప్రివ్యూ' ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన మేకర్స్ రిలీజ్ చేసే ప్రతీ అప్‌డేట్ సినిమాకు మరింత హైప్ తీసుకువస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారట. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ సినిమాలో.. విజయ్ భాగం కావడం అభిమానుల్ని మరింత ఆనందానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ నటిస్తుండడంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు.
'జవాన్' లో తలపతి విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ ఓ వార్త చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్, విజయ్ స్క్రీన్‌ను పంచుకుంటున్నారన్న వార్త మరోసారి తెరపైకి రావడంతో సినీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. 'జవాన్ ప్రీవ్యూ'లో షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతారలను యాక్షన్‌లో చూపించారు. కానీ తలపతి విజయ్ గురించి ఎక్కడా చూపించలేదు. అయితే ఈ యాక్షన్ డ్రామాలో మాస్టర్ యాక్టర్ కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తన సరికొత్త ప్రకటనతో వారి ఉత్సాహానికి ఆజ్యం పోశారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యానిక్ బెన్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు షారుఖ్ ఖాన్, విజయ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూస్తారని అన్నారు. ఒకటి జైలు పోరాటం, మరొకటి పూణే రైలు స్టేషన్ సీక్వెన్స్ అనే రెండు సన్నివేశాల్లో వారిని చూడనున్నామని ఆయన పేర్కొన్నారు. 'జవాన్'లో విజయ్ కాస్టింగ్ గురించి ఆరా తీయగా... యానిక్ నవ్వుతూ బదులిచ్చారు. "తలపతి విజయ్ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు" అని చెప్పాడు. అయితే అతను విజయ్ సేతుపతి చెప్పాడా లేదంటే.. దళపతి విజయ్ గురించి మాట్లాడుతున్నాడో బెన్ స్పష్టం చేయలేదు.
ఇక 'జవాన్'లో దళపతి విజయ్ అతిథి పాత్రపైనా ఎటువంటి క్లారిటీ లేదు. దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్‌లతో మంచి అనుబంధం ఉన్నందున అతను ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
బాలీవుడ్‌లో ప్రస్తుతం రాబోయే కొత్త సినిమాలలో 'జవాన్' మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. విలన్‌గా మారిన షారుఖ్ ఖాన్ తలపెట్టిన యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజాగా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ది డోగ్రా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో థియేటర్లలోకి రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com