Preminchukundam Raa : వెంకటేష్ తో నా ఫస్ట్ సినిమా అలా ఆగిపోయింది : జయంత్ సి పరాన్జీ

Preminchukundam Raa : వెంకటేష్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ప్రేమించుకుందాం రా.. ఇదే జయంత్ కి మొదటి సినిమా కావడం విశేషం. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రం 1997 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో వెంకటేష్ సరసన అంజలా జవేరి హీరోయిన్ గా నటించగా, జయప్రకాశ్ రెడ్డి, శ్రీహరి విలన్ లుగా నటించారు.
పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముందుగా వెంకీతో ఓ మూవీ ఓకే అయిందని దాదాపుగా పదిరోజుల పాటు షూటింగ్ కూడా చేశామని వెల్లడించారు.. ఇందులో సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ లను హీరోయిన్ లుగా రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశామని, లవ్ అండ్ ఎంటర్ టైన్మెంట్ గా చిన్న క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంటుందని తెలిపారు.
కానీ ఆ సబ్జెక్ట్ కరెక్ట్ కాదని అనిపించి డ్రాప్ అయ్యామని తెలిపారు. మూడేళ్ళ తర్వాత ప్రేమించుకుందాం రా కథతో వెంకీతో సినిమా చేసి దర్శకుడిగా పరిచయం అయ్యానని తెలిపారు. అయితే ప్రేమించుకుందాం రా కథకి ముందుగా తాను దర్శకుడిని కాదని దిన్ రాజ్ నుంచి మిస్ అయి తనవద్దకి ఆఫర్ వచ్చినట్టుగా తెలిపాడు జయంత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com