బిగ్ బ్రేకింగ్.. సీనియర్ నటుడు జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం
సీనియర్ నటుడు జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో ప్రస్తుతం షూటింగ్‌లు లేని కారణంగా ఆయన గుంటురులోని విద్యానగర్‌లో ఉన్నారు. అక్కడే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. తెల్లవారుజామున బాత్‌రూమ్‌లోనే ఆయన కుప్పకూలిపోయారు. ఈ వార్త తెలుగు ప్రేక్షకులందరినీ షాక్‌కు గురి చేసింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్‌రెడ్డి విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. ప్రేమించుకుందాం రా.. సినిమాతో మొదలుపెట్టి అనేక సినిమాల్లో రాయలసీమ యాసతో ఆయన పాపులర్ అయ్యారు. ఇక కామిడీ విషయంలోనూ ఆయన టైమింగుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిక్, ఢీ, రెడీ, కృష్ణ, రచ్చ, రేసుగుర్రం, నాయక్, బాద్‌షా, టెంపర్, పటాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో చిత్రాల్లో నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాయలసీమ యాసే కాదు తెలంగాణ మాండలికాల్ని కూడా అద్భుతంగా పలికించిన ఘనత ఆయన సొంతం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com