Telugu Cinema: మోహన్ బాబుతో డ్యూయెట్.. రిజెక్ట్ చేసిన జయసుధ

Telugu Cinema: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సహజనటి జయసుధలది మంచి హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి నటించిన శివరంజని, ఏడడుగుల బంధం, కళ్యాణ తిలకం,రాయలసీమ రామన్నచౌదరి మొదలగు చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అయితే మోహన్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పెదరాయుడు సినిమాలో భానుప్రియ పాత్రకు ముందుగా జయసుధని అనుకున్నారట.
కానీ ఆ సినిమాలో డ్యూయెట్ ఉండడంతో చేయనని అన్నారట జయసుధ. దీంతో ఆమె ప్లేస్‌లో భానుప్రియను తీసుకున్నారు. మరో హీరోయిన్‌గా సౌందర్యను తీసుకున్నారు. మోహన్ బాబు డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు.
ఈ సినిమా తర్వాతే మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయనకి ఈ చిత్రంతోనే కలెక్షన్ కింగ్ అనే బిరుదు రావడం విశేషం. తమిళ్‌లో హిట్టైన నాట్టమై అనే చిత్రానికి ఇది రీమేక్ కాగా మోహన్ బాబుతో ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనిపించి పైసా పారితోషికం తీసుకోకుండా రజనీకాంత్ నటించడం మరో విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com