Tollywood: జెడీ చక్రవర్తి 'దయ' ఫస్ట్ లుక్ రిలీజ్

Tollywood: జెడీ చక్రవర్తి దయ ఫస్ట్ లుక్ రిలీజ్
X


జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో దయా సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చక్రవర్తి సరసన ఈషా రెబ్బ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది. ఇందులో అద్భుతమైన హమ్మింగ్ తో భారతీయ సంసృతికి చెందిన వాయిస్ ఓ గీతాన్ని పాడుతుంటుంది. అంతలోనే ఖడ్గం, రాక్షసుని తల కనపడుతుండగా... రక్తపు చారల్లా ఉండే ఔట్ లైన్స్ తో కాళీమాత ప్రత్యక్షమవుతుంది. కాళీమాత ముఖం లోంచి జేడీ చక్రవర్తి ఫేస్ రివీల్ అవుతుంది. అంతలోనే దయా అనే టైటిల్ ను రివీల్ చేస్తారు.




ఒక రకంగా దయా అనే క్యారెక్టర్ దయ లేకుండా శత్రువధ చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. పవన్ సాదినేని ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇప్పటికే దయా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ టైటిల్ కు ఫీల్ ద రేజ్ అనే ట్యాగ్ లైన్ ను పొందుపరచారు.

ఈ సిరీస్ లో ఈషా రెబ్బ, రమ్య నంబేసన్, కమల్ కామరాజు తదితరులు స్క్రీన్ ను పంచుకున్నారు. ఇందులో జేడీ 2.0ను చూస్తారని దర్శకుడు హామీ ఇచ్చాడు. జేడీ గతంలో హోమం, మనీ మనీ మోర్ మనీ, సిద్దం, ఆల్ ది బెస్ట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. హీరోగా మనీ మనీ, గులాబి, అనగనగా ఒక రోజు, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు హీరోగా చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ హీరోగా నటిస్తున్నారు.

Tags

Next Story