సినిమా

Jeevitha in MAA Elections 2021: రుజువు చేయలేకపోతే చెప్పుతో కొట్టొచ్చు: జీవిత

Jeevitha in MAA Elections 2021: మా ఎన్నికల్లో పోరాడుతున్న ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండాలన్నారు జీవిత.

Jeevitha in MAA Elections 2021: రుజువు చేయలేకపోతే చెప్పుతో కొట్టొచ్చు: జీవిత
X

Jeevitha in MAA Elections 2021: మా ఎన్నికల్లో పోరాడుతున్న ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండాలని, సభ్యులను ఒత్తిడి చేసే పనులు ఎవరూ చేయొద్దని సీనియర్‌ నటి జీవిత విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరూ ప్రశాంతంగా తమకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నారు. శివ బాలాజీ, రాజీవ్‌ కనకాల ఆరోపిస్తున్నట్లుగా.. అసోసియేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని, దీన్ని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జీవిత అన్నారు. రుజువు చేయలేకపోతే తమను చెప్పుతో కొట్టవచ్చంటూ సవాల్‌ విసిరారు. ప్రకాశ్‌రాజ్‌ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన నటుడని.. ఆయన మా అధ్యక్షుడిగా పోటీ చేస్తే తప్పేంటని జీవిత అన్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES