Jeevitha Rajasekhar : చిరంజీవితో మాకు ఎలాంటి విభేదాలు లేవు : జీవితా రాజశేఖర్

Jeevitha Rajasekhar: రాజశేఖర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శేఖర్.. శివాని రాజశేఖర్ కీ రోల్ ప్లే చేశారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు జీవిత.
అందులో భాగంగా.. చిరంజీవితో ఉన్న విభేధాల పైన జీవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. "చిరంజీవితో కూడా మాకు ఎలాంటి గొడవలు లేవు. చిరంజీవిగారితో ఎప్పుడో జరిగిన ఓ విషయాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం మళ్ళీ మళ్ళీ ఆ వీడియోల్ని పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళే మళ్ళీ మాకు, చిరంజీవి గారి మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నారు " అని జీవిత వెల్లడించారు.
మలయాళంలో సూపర్ హిట్ ఐన 'జోసెఫ్' సినిమా బాగా నచ్చడంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశామని జీవిత వెల్లడించారు. ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా పలాస డైరెక్టర్, నీలకంఠను అనుకున్నామని, కానీ వాళ్ళు బిజీగా ఉండడంతో తానే డైరెక్షన్ చెయ్యాల్సి వచ్చిందని తెలిపారు జీవిత. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com