Jennifer Lawrence: తన నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ్చు అంటున్న నటి..!
Jennifer Lawrence (tv5news.in)
Jennifer Lawrence: ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే.. హాలీవుడ్ నటీనటులు చాలా బోల్డ్‌గా ఉంటారు. బోల్డ్‌గా మాట్లాడుతారు. ఎవరు ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టి తమ నిర్ణయాన్ని బయటపెడతారు. తాజాగా అలాగే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ లారెన్స్. తాను జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కుంది. వాటన్నింటిని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చింది.
2014లో పలువురు హ్యాకర్లు చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన 500 ప్రైవేట్ ఫోటోలను సేకరించి వాటిని లీక్ చేశారు. అందులో హాలీవుడ్‌కు చెందిన భామలే ఎక్కువ. దానిలో జెన్నిఫర్ లారెన్స్ ఒకరు. అయితే లీక్ అయిన కాసేపట్లోనే ఇవి నెట్‌లో వైరల్ అవ్వడంతో చాలామంది తనను నగ్నంగా చూశారు. ఆ ఘటన వల్ల తాను మానసిక ఒత్తిడికి గురయిందని జెన్నిఫర్ లారెన్స్ చెప్పింది.
తన అంగీకరం లేకుండా తన నగ్న శరీరాన్ని ఎవరైనా చూడవచ్చని.. కానీ ఆ ఫోటోలు అలా వైరల్ అవ్వడం వల్ల తన జీవితంలో పెద్ద గాయమే తగిలిందని జెన్నిఫర్ లారెన్స్ అన్నారు. ఈ హ్యాక్‌ను లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పరిగణించాలని కూడా అప్పట్లో ఆమె డిమాండ్ చేశారు. 2017లో తాను ప్రయాణిస్తున్న ఓ విమానం రెండు ఇంజన్లు పాడవడంతో ఒక్కసారిగా తాను చనిపోతానని అనుకొని తన ఫ్యామిలీకి మెసేజ్ పెట్టడం కూడా ఆమో గుర్తుచేసుకుని బాధపడ్డారు.
జెన్నిఫర్ లారెన్స్ ప్రస్తుతం 'డోంట్ లుక్ అప్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. అందుకే తాను ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం బిజీగా గడిపేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com