Gungun Upadhyay: బిల్డింగ్‌పై నుండి దూకి మోడల్ ఆత్మహత్యాయత్నం.. తండ్రికి ఫోన్ చేసి మరీ..

Gungun Upadhyay (tv5news.in)
Gungun Upadhyay: గ్లామర్ ప్రపంచం అంటే ఎన్నో ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. పైగా వాటిని సెలబ్రిటీలు ఎలా ఎదుర్కుంటున్నారు అనేదానిపై ప్రేక్షకుల ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. కారణం ఏంటో తెలియదు కానీ.. తాజాగా ఓ 19 ఏళ్ల మోడల్ బిల్డింగ్‌పై నుండి ఆత్మహత్యకు పాల్పడింది. అసలు తన ఆత్యహత్యకు కారణాలు ఏంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల గున్‌గున్ ఉపాధ్యాయ్ మోడల్‌గా పనిచేస్తోంది. పని మీద ఉదయ్‌పూర్ వెళ్లిన గున్‌గున్ శనివారం తిరిగి జోధ్‌పూర్‌కు చేరుకుంది. అక్కడ రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో స్టే తీసుకుంది. అంతలోనే తాను అదే హోటల్ బిల్డింగ్‌పై నుండి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు గున్‌గున్ తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
హోటల్ ఆరవ ఫ్లోర్ నుండి దూకి గున్‌గున్ ఆత్మహత్యకు పాల్పడింది. కానీ దూకే ముందు తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతున్నానని తెలిపిందట గున్‌గున్. తన తండ్రి భయపడి స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు హోటల్ దగ్గరకు చేరుకునేసరికి గున్‌గున్ ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలతో ఉన్న తనను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం వల్ల తన కాళ్లకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com