John Abraham : మా కాంబోలో వచ్చిన బెస్ట్ మూవీ ఇదే: జాన్‌ అబ్రహం

John Abraham : మా కాంబోలో వచ్చిన బెస్ట్ మూవీ ఇదే: జాన్‌ అబ్రహం
X

నిఖిల్ అద్వానీ డైరెక్షన్ లో బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన ‘వేదా’ ఈ నెల 15న రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ‘వేదా’ కలెక్షన్లపై జాన్ అబ్రహం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాము గొప్ప సినిమాను నిర్మించామన్నాడు. అందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పాడు.‘గొప్ప సందేశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఇలాంటి మూవీస్ లో యాక్ట్‌ చేయాలంటే ధైర్యం అవసరం. ‘బాట్లా హౌస్‌’ తర్వాత దర్శకుడు నిఖిల్‌తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. మా కాంబోలో వచ్చిన బెస్ట్‌ మూవీ ఇది. హిట్‌ లేదా ఫ్లాప్‌ అనే విషయాన్ని పక్కన పెడితే.. మన సినిమాలో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నామనేది ముఖ్యం. మహిళల సంరక్షణ వంటి సీరియస్‌ అంశాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా చూపించాం. సినిమా ఏదైనా బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్ కాకపోతే బాధపడుతుంటాం. అది సాధారణం. సినిమాలో ఏదైనా తప్పులు ఉంటే అది విజయాన్ని అందుకోకపోవచ్చు. కానీ, ‘వేదా’ కోసం ప్రతి ఒక్కరం కష్టపడ్డాం’ అని జాన్‌ అబ్రహం చెప్పుకొచ్చాడు.

Tags

Next Story