Johny Master : జానీ మాస్టర్ దొరికాడు

ఢీ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన యువతిని మాయ మాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆ అమ్మాయి కేస్ పెట్టింది. అన్ని వైపుల నుంచి పరిశీలించిన నార్సింగి పోలీస్ లు కేస్ నమోదు చేశారు. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డట్ట చెప్పడంతో అతనిపై పోక్సో యాక్ట్ కింద మరో సెక్షన్ యాడ్ చేశారు. తనపై కేస్ అయినప్పటినుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. పోలీస్ లు వెదుకుతూనే ఉన్నారు. అతని ఆచూకి ఉంది అని సమాచారం వచ్చిన ప్రతి చోటుకీ ఒక టీమ్ వెళ్లింది. నిన్న అతను లదాఖ్ లో ఉన్నాడని చెప్పారు. బట్ ఫైనల్ గా అతను బెంగళూరులో పట్టుబడ్డాడు. బెంగళూరులో ఎస్ఓటి పోలీస్ లు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకు వస్తున్నారు.
జానీని కోర్ట్ లో హాజరు పరిచి పోలీస్ కస్టడీకి తీసుకునే అవకావం ఉంది. కస్టడీలో ఇంటరాగేషన్ తో పాటు అతని వెర్షన్ ను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటే పెద్ద ఇబ్బందేం లేకుండా జైలుకు వెళ్లిపోతాడు. అయితే జానీ అరెస్ట్ కావడానికి మరో కారణం కూడా అదే పోక్సో కేస్. నిజానికి ఈ కేస్ నుంచి ముందస్తు బెయిల్ తీసుకుని అప్పుడు పోలీస్ లకు లొంగిపోవాలన్న ఆలోచనలోనే ఇన్నాళ్లూ పోలీస్ లకు దూరంగా ఉన్నాడు జానీ. ఈ మేరకు తన లాయర్స్ తో సంప్రదింపులు జరిపాడు. అయితే పోక్సో కేస్ లో వెంటనే బెయిల్ రాదు కాబట్టే ఇక అరెస్ట్ అయిపోయాడు అంటున్నారు. మొత్తంగా అతను ఎక్కడ ఎలా మొదలుపెట్టాడో కానీ.. ఆ అమ్మాయితో వ్యవహారం ఇప్పుడు తన అరెస్ట్ వరకూ వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com