Viswam : జర్నీ అఫ్ విశ్వం.. గోపీచంద్ కంటే శ్రీనువైట్ల హైలైట్

Viswam : జర్నీ అఫ్ విశ్వం.. గోపీచంద్ కంటే శ్రీనువైట్ల హైలైట్
X

మాచో స్టార్ గోపీ చంద్, స్టైలిష్ డైరెక్టర్ శ్రీను వైట్ల అప్ కమింగ్ మూవీ విశ్వం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్ - ది జర్నీ ఆఫ్ విశ్వం అనే వీడియోతో ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేశారు. ఆడియన్స్ లో ఎక్సయిట్ మెంట్ క్రియేట్ చేస్తూ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో తెలియజేసేలా ఈ వీడియోని డిజైన్ చేశారు.

వండర్ ఫుల్ విజువల్స్, డైనమిక్ అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు వీడియోలో వున్నాయి. ప్రేక్షకులను అలరించే ఇంపార్టెంట్ హ్యుమర్ సీక్వెన్ వుంది. అలాగే ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెట్టే సీన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. శ్రీను వైట్ల 'వెంకీ' మార్క్, 'బాద్ షా' మార్క్ హ్యుమర్ ఉన్నట్టు వీడియోను చూస్తే అర్థం అవుతోంది.

ప్రమోషనల్ వీడియోలో గోపీచంద్ కంటే కూడా డైరెక్టర్ శ్రీనువైట్ల హైలైట్ అయ్యారు. ఆయన టేకింగ్, విజువల్ ప్రెజెంటేషన్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. గోపీచంద్ యాక్టింగ్, స్టైలిష్ ఇంటెన్స్ రెండిట్లో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Tags

Next Story