Jr NTR and Pranathi: అన్నా, వదినలకు అభిమానులు ప్రేమతో.. పెళ్లి రోజు శుభాకాంక్షలు

Jr NTR and Pranathi:యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, భార్య ప్రణతి ఈరోజు 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తారక్, ప్రణతి తెలుగు ప్రేక్షకులు అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరు. తెలుగు చిత్రసీమలో పర్ఫెక్ట్ జోడీగా పేరుగాంచిన వీరిద్దరూ కలిసి చాలా అరుదుగా బయట కనిపిస్తారు.
11 ఏళ్ల క్రితం ఇదే రోజు మే 5, 2011న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. 11 సంవత్సరాల వారి అనుబంధానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఉన్నారు. చాలా తక్కువగా సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు తారక్. అప్పుడప్పుడు అభిమానులకోసం కుటుంబానికి సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తారు.
ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం శ్రీనివాస్ జి స్మోర్ అనే అతడికి. దాంతో తన అభిమాని హీరోకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు సోషల్ మీడియా వేదికగా. ఎన్టీఆర్, ప్రణతిల 11వ వివాహ వార్షికోత్సవ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్ మేడ్ యానివర్సరీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక అభిమాని ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు. 11 సంవత్సరాల సహజీవనం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ @tarak9999 అన్నా & #ప్రణతి వదినమ్మ. మరో నెటిజన్ ఇలా వ్రాశాడు: నా #Ntr @tarak9999 Drlng #pranathi అక్కకు మీరు మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అని తెలియజేశారు.
ఇక సినిమాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా రాజమౌళి RRRలో భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com