Jr NTR Family : తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ ఫ్యామిలీ

Jr NTR Family : తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ ఫ్యామిలీ
X
Jr NTR Family : మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Jr NTR Family : సినీ నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ తప్ప మిగతా కుటుంబ సభ్యులు ఇందులో కనిపించారు.. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్‌‌లో బిజీగా ఉన్నాడు తారక్.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ కలిసి నటించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Tags

Next Story