NTR Remuneration : కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!

NTR Remuneration :  కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్  కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!
NTR Remuneration : జనతా గ్యారేజ్ మూవీ తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే...

NTR Remuneration : జనతా గ్యారేజ్ మూవీ తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే... ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.

RRR లాంటి హ్యుజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

RRR మూవీ కోసం రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న యంగ్ టైగర్.. కొరటాల మూవీ కోసం ఏకంగా రూ. 55 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్నట్టుగా సమాచారం. మూవీ కోసం 70 రోజులు డేట్స్ కేటాయించారట ఎన్టీఆర్.. స్టూడెంట్ లీడర్‌గా ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ముందుగా అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోందని న్యూస్ వచ్చింది.. కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు మేకర్స్.

Tags

Read MoreRead Less
Next Story