Jr NTR: కబడ్డీ ప్లేయర్‌గా ఎన్టీఆర్.. బుచ్చిబాబు భారీ స్కెచ్..!!
Jr. NTR: రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ పూర్తయింది.. విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.. ఈసారైనా పోస్ట్‌ఫోన్ అవ్వకుండా ఉండాలని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. అన్నీ బావుంటే ఇప్పటికే ప్రకటించిన డేట్ మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుంది.
ఇక తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన తారక్.. కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈలోపు మరో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న చిత్రం కావడం, ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఇలాంటి చిత్రంలో చేయకపోవడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి ముందుగా హీరోయిన్ జాన్వీ కపూర్‌నే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత అది మిస్సయింది. దాంతో బుచ్చిబాబు సినిమాకి ఆమెని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివతో సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com