RRR: నువ్వు లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు చరణ్: ఎన్టీఆర్ లెటర్ వైరల్

RRR: నువ్వు లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు చరణ్: ఎన్టీఆర్ లెటర్ వైరల్
RRR: కొమరం భీమ్ పాత్రకు తనను ఎంపిక చేసినందుకు జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ లెటర్ రాశాడు ఎన్టీఆర్.

RRR: కల్పిత కథను అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ద్వారా మరోసారి చరిత్ర సృష్టించారు. కథను ఎంచుకున్న తీరు, దానికి తగ్గ పాత్రలు.. ఒకరిని మించి మరొకరు పోటీ పడి నటించారు. ఇద్దరు స్టార్ హీరోలు తగ్గేదేలే అన్నట్లు నటించారు. ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నారు. ఇక కొమరం భీమ్ పాత్రకు తనను ఎంపిక చేసినందుకు జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ లెటర్ రాశాడు ఎన్టీఆర్.


ఈ చిత్రం నా కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచింది. నువ్వు లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు చరణ్.. పాత్రకు తగ్గట్టు నన్ను నీరులా మార్చావు.. అల్లూరి సీతారామరాజు పాత్రకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు అని ఎన్టీఆర్ అన్నారు.

అజయ్ దేవగణ్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా.. మన ప్రయాణం మరిచిపోలేనిది. అలియా నటనలో నువ్వొక పవర్ హౌస్. నీ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మిగిలిన నటీనటులు కూడా వారి వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. నిర్మాత దానయ్య గారు.. స్వరాలు సమకూర్చిన కీరవాణి ఇలా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.


కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారికి, చిత్రానికి పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి థ్యాంక్స్ చెప్పారు. ఇక నాటు నాటు పాటకు కొత్త మాస్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొమురం భీముడో పాటను పాడిన కాలభైరవకు, సినిమాకు సంబంధించిన ప్రతి విభాగాన్ని చూసుకున్న కార్తికేయకు థ్యాంక్స్ చెప్పారు లెటర్ ద్వారా.

ఆర్ఆర్ఆర్ ను విష్ చేసిన చిత్ర పరిశ్రమలోని నటీ నటులు, సినీ విశ్లేషకులకు ధన్యవదాలు తెలిపారు. మనం అంతా ఒకటిగా ఉన్నప్పుడే ఇండియన్ సినిమా నెంబర్ వన్ గా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ మరిన్ని మంచి చిత్రాల ద్వారా అలరిస్తా అని ఎన్టీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story