Jr NTR : సడెన్ గా ఎన్టీఆర్ పై ఈ న్యూస్ ఏంటీ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లైనప్ ఓ రేంజ్ లో ఉందిప్పుడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అన్నీ ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వస్తున్నవే. వీటిలో ముందుగా వచ్చేది ‘వార్ 2’. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) మూవీ వచ్చే యేడాది జూన్ 25న రిలీజ్ అవుతుంది. అదే టైమ్ లో ప్రస్తుతం దేవర 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అటు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తో ఓ సినిమా ఉండబోతోంది. ఇవన్నీ పూర్తి కావడానికి మూడేళ్లైనా పడుతుంది. ఈ టైమ్ లో ఓ అనుకోని రూమర్ ఎన్టీఆర్ పై హల్చల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఎన్టీఆర్ స్టార్ హీరో మాత్రమే కాదు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల నటుడు కూడా. అందుకే ఆయన ఓ బయోపిక్ లో నటించబోతున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది కూడా దాదా సాహెబ్ పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అంటే భారత చలన చిత్ర పితామహుడుగా చెబుతారు. ఆయన పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త ఎలా క్రియేట్ అయిందో కానీ బాగా వినిపిస్తోంది. బట్ ఇందులో ఏ మాత్రం నిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయోపిక్ చేస్తే ఎన్టీఆర్ లైనప్ దెబ్బతింటుంది. పైగా ఈ బయోపిక్ అతని మాస్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సడెన్ గా ఈ న్యూస్ ఏంటో కానీ.. ఎవరో కావాలనే క్రియేట్ చేసినట్టున్నారు అనేది అభిమానుల అనుమానం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com