Jr NTR : నా ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతంటే : ఎన్టీఆర్

Jr NTR : RRR ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. మొదటి సినిమాకి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం RRR సినిమాకు 45 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. బాలరామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో బాలనటుడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు.
తనపై మొహమాటం లేకుండా బాహాటంగా విమర్శలు చేసేవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని ఎన్టీఆర్ తెలిపారు. వారిలో ఒకరు తన తండ్రి హరికృష్ణ కాగా మరొకరు రాజమౌళి అని వెల్లడించాడు. రాజమౌళి వల్లే ప్రస్తుతం నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో మొత్తం నాలుగు సినిమాలు రూపొందాయి. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెరకెక్కాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ , జక్కన్న కాంబినేషన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెరకెక్కింది.
336 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ సినిమా తెరకెక్కించారు. RRR విడుదలకు ఇంకా వారం మాత్రమే సమయం ఉండటంతో, ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో RRR రికార్డులు సృష్టించగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరి ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నటించాడు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించాడు. అలియాభట్ సీత పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com