Jr.Ntr : ఎన్టీఆర్ యుద్ధం ముగిసింది

Jr.Ntr :  ఎన్టీఆర్ యుద్ధం ముగిసింది
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో ఇమేజ్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నాడు. ప్యాన్ ఇండియాను దాటి వాల్డ్ వైడ్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఆ ఇమేజ్ తోనే దేవర 400 కోట్లకు పైగా వసూలు చేసి అదరగొట్టింది. ఆర్ఆర్ఆర్ టైమ్ లో అతను అన్ని భాషల్లో అనర్ఘళంగా మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. చాలా సాధికారికంగా మాట్లాడాడు. తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అదే అతనికి తొలి హిందీ మూవీ అవకాశాన్ని తెచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ‘వార్ 2’లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. అంటే ఇద్దరు హీరోల మల్టీస్టారర్ అన్నమాట. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. హీరోలిద్దరూ ఇండియాన్ ఏజెంట్స్ గా నటిస్తారు అనే ప్రచారం ఉన్నా.. ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే రూమర్ కూడా ఉంది.

ఇక చాలా వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొన్నాడు. కొన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఉన్న ఓ పాటను పిక్చరైజ్ చేశారట. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ పోర్షన్ అంతా పూర్తయిపోయింది. ప్యాచ్ వర్క్ లు కూడా లేవని టాక్. సో.. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ సెట్స్ లో ఈ గురువారం నుంచే ఎంటర్ అవుతున్నాడంటున్నారు. వార్ 2 ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. డ్రాగన్ ను 2026 జనవరి 9న విడుదల చేస్తాం అన్నారు. ఎన్టీఆర్ దూకుడు చూస్తుంటే ఈ రెండు సినిమాలూ చెప్పిన టైమ్ కు ఖచ్చితంగా విడుదలయ్యేలానే ఉన్నాయి.

Tags

Next Story