Jr NTR: 5 మిలియన్ల క్లబ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

టాలీవుడ్ లో హీరో ఎన్టీఆర్ కి ఉన్న ఈమెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడో ఒక్కోసారి సందర్భానుసారంగా పోస్టులు పెడుతూ ఉంటారయన.. అయినప్పటికీ ట్విట్టర్ లో మాత్రం ఆయన ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్లకి చేరింది. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా తారక్ నిలిచాడు. సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు ఎన్టీఆర్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com