NTR : హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..!

NTR : హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..!
NTR : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టాడు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఎ

NTR : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టాడు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఎన్టీఆర్ హనుమాన్ దీక్షని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాషాయ దుస్తులు.. మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమతో ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినీ కెరీర్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ ఈ దీక్షని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీని కంప్లీట్ చేసిన తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఎన్టీఆర్‌‌‌కి 30వ చిత్రం కావడం విశేషం.


Tags

Read MoreRead Less
Next Story