సినిమా

Samantha : తగ్గేదే.. లే.. ఎన్టీఆర్‌‌తో వన్స్‌‌‌మోర్ ..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Samantha : తగ్గేదే.. లే.. ఎన్టీఆర్‌‌తో వన్స్‌‌‌మోర్ ..!
X

Samantha : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఈ రెండో సినిమాని పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కీయరా అద్వానీ నటిస్తోందని ముందునుంచి ప్రచారం నడిచింది.. కానీ ఇప్పుడా ప్లేస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. ఎన్టీఆర్ తో సమంతకి ఇదో సినిమా అవుతుంది.

బృందావనం, రామయ్య వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ అరఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండగా, కొరటాల ఆచార్యకి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మార్చ్ లో వీరిద్దరి మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES