మెగా ఫ్యామిలీలో చిట్టి యువరాణి.. శుభాకాంక్షలు తెలిపిన జూ.ఎన్టీఆర్

మెగా ఫ్యామిలీలో చిట్టి యువరాణి.. శుభాకాంక్షలు తెలిపిన జూ.ఎన్టీఆర్
పాపాయితో ప్రతీ క్షణం గడపాలని ఆ మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండి పోతాయన్న తారక్


రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల సమూహానికి ఆహ్వానం అంటూ ట్వీట్ చేశారు. మంగళవారం ఉదయం రామ్ చరణ్ సతీమణి ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. పాపాయితో ప్రతీ క్షణం గడపాలని ఆ మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండి పోతాయని తారక్ అన్నారు. అలాంటి ఆనందం మరెక్కడా దొరకదని, అది చిన్నారి చిరునవ్వులో తప్ప... అని సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుడి ఆశీర్వాదం పాపాయికి ఉండాలని కొనిదెల ఫ్యామిలీ మొత్తం సంతోషంతో నిండిపోవాలని కోరారు.

రామ్ చరణ్ - ఉపాసనా దంపతులకు వివాహమైన 11 సంవత్సరాలకు బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మోగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇటు మెగాస్టార్ చిరంజీవి తాను తాత అయిన ఆనందాన్ని పంచుకున్నారు. చిట్టి మెగా యువరాణికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. తల్లిదండ్రులుగా రామ్ చరణ్ ఉపాసనలకు, తాతైన తనకు ఎంతో గర్వంగా ఉందని... ఈ చిట్టి యువరాణి మెగా ఫ్యామిలీ మొత్తానికి మిలియన్ల కొలది సంతోషాన్ని, ఆనందాన్ని అందించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటు మెగా ఫ్యామిలీ, అటు కామినేని ఫ్యామిలీ బిడ్డను చూడటానికి అపోలో హాస్పిటల్ కు క్యూకట్టారు. రామ్ చరణ్ ఉపాసనల వివాహం జూన్ 14, 2012లో జరిగింది. కొంత కాలంగా ఉపాసన- రామ్ చరణ్ లకు పిల్లల విషయంలో ఆయా వేదికలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంకా పిల్లల గురించి ఆలోచించడంలేదా అని పలువురు తమ ఆతృతను వ్యక్తపరిచారు. అందుకు ఉపాసన చాలా హుందాగా జవాబు ఇచ్చారు. తాము తమ కెరీర్ లో నిలదొక్కుకున్నాకే పిల్లల గురించి ఆలోచిస్తామని చెప్పారు. అనుకున్నట్లుగానే రామ్ చరణ్ RRR లాంటి ఆస్కార్ విన్నింగ్ ఫిలింతో తన సత్తా చాటాడు. చరణ్ తో పాటు తారక్ కూడా RRR లో తెరను పంచుకున్నాడు.

రామ్ చరణ్ ఉపాసనలకు కెరీర్ పై ఉన్న కోణం ప్రతీ యువతీ, యువకులకు మార్గనిర్ధేశం చేసేలా ఉంది. కెరీర్ ను తమకు అనుగునంగా మలుచుకుని ఆపై బిడ్డకు జన్మనివ్వాలన్న ఆలోచన నిజంగా అభినందనీయం. మా తరపున కూడా నవ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు.

Tags

Read MoreRead Less
Next Story