Jurassic World : జురాసిక్ వరల్డ్ .. రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉంది..?

1993లో వచ్చి ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచిన సినిమా జురాసిక్ పార్క్. వేల యేళ్ల క్రితమే అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే ఊహకు ఓ నవల పాఠకులను మెప్పిస్తే.. ఆ ఊమకు ప్రాణం పోసి ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశాడు లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఎగబడి చూశారీ సినిమాను. తర్వాత ఇదే ఫ్రాంఛైజీలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కొన్నాళ్లుగా వస్తోన్న జురాసిక్ పార్క్ నేపథ్య సినిమాలేవీ ఆకట్టుకోవడం లేదు. త్వరలో‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’ అంటూ మరో మూవీ రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ఒక రీసెర్చ్ కోసం ఒరిజినల్ జురాసిక్ పార్క్ ఉన్న ఓ ఐలండ్ కు ఒక టీమ్ వెళుతుంది. అత్యంత ప్రమాదకరమైన మిషన్ ను వీళ్లు స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్లాక వీరు ఓ మూడు డైనోసార్స్ డిఎన్ఏను సంపాదించాల్సి ఉంటుంది. ఆ ఐలండ్ లో అప్పటి వరకూ చూడనంత అతి పెద్ద డైనోసార్స్ ఉంటాయి. మరి వీళ్లు ఆ డిఎన్ఏను సంపాదించారా.. తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే నేపథ్యంలో ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ డైనోసార్ నేపథ్యపు సినిమాల టెంప్లేట్ లోనే ఉన్నా.. ట్రైలర్ చివర్లో సముద్రంలో వీళ్లు మరికొన్ని పురాతన జీవులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి గురించి సస్పెన్స్ అన్నట్టుగా కట్ చేశారు ట్రైలర్. ట్రైలర్ అయితే బావుంది. మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నట్టుగానే కనిపిస్తోంది.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి డైనోసార్స్ గురించి వచ్చిన ఫస్ట్ మూవీకి కథ అందించిన డేవిడ్ కోప్ కథ అందించాడు. అలాగే స్టార్స్ వార్స్ లాంటి మూవీస్ కు పని చేసి డైనమిక్ విజువలిస్ట్ గా పేరు తెచ్చుకున్న గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. ఈ కారణంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి అనేది నిజం. మరి జూలైలో విడుదల కాబోతోన్న ఈ జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com