K Raghavendra Rao : దేవతకి 40 ఏళ్లు.. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఎమోషనల్ పోస్ట్

X
By - Sai Gnan |10 Sept 2022 8:41 PM IST
K Raghavendra Rao : ఈ సినిమా 1982 సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఇవాళ్టితో సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది
K Raghavendra Rao : దర్శకుడు కె రాఘవేంద్రరావు సోషల్ మీడియాతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రద హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా దేవత. ఈ సినిమా 1982 సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఇవాళ్టితో సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు.. 'దేవత కి 40 ఏళ్ళు … అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకి నా అభినందనలు.' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ కాలంలోనే ఈ సినిమా పెద్ద హిట్‌తో పాటు సుమారు 1.7 కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్స్ చేసింది. ఇందులోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ వెల్లకిల్లా పడ్డాదమ్మో.. ఎన్నెలొచ్చి రెల్లుపూలై వెండి గిన్నెలయ్యేనమ్మో..' పాట ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్‌లో ఒకటి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com