Kiran Abbavaram 'Ka' : ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టిన 'క'

Kiran Abbavaram Ka :  ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టిన క
X

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'క'. సుజిత్ - సందీప్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది మూవీ టీమ్. కిరణ్ కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. ఓ చిన్న హీరో మూవీ ప్రీమియర్స్ కు సైతం చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన క సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ సాధారణమే అయినా స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశారు డైరెక్టర్స్. 1970స్ బ్యాక్ డ్రాప్ లో కృష్ణగిరి అనే ఊరిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందిన క మూవీ క్లైమాక్స్ కు జనం ఫిదా అయిపోయారు. ఎవ్వరూ ఊహించలేని క్లైమాక్స్ అది. ఓ మాస్ మూవీని అలా ముగించడం హిస్టరీలో ఫస్ట్ టైమ్ అని చెప్పినా అతిశయోక్తి కాదు అని చెబుతున్నారు ప్రేక్షకులు.

కొన్ని మైనస్ లు ఉన్నా.. మంచి నేపథ్య సంగీతం, బ్రిలియంట్ సినిమాటోగ్రఫీతో అవన్నీ మర్చిపోయేలా చేశారు టెక్నీషియన్స్. కిరణ్ సరసన నటించిన నయన్ సారిక క్యూట్ గా బావుంది. వీరి మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మరో ఫీమేల్ లీడ్ చేసిన తన్వీ రామ్ పాత్ర కీలకంగా కనిపించింది. ఊహించగలిగే ట్విస్ట్ లతోనే డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెప్పించిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టింది.


కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బెస్ట్ అనిపించేలా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఈ చిత్రం 6. 18 కోట్ల గ్రాస్ సాధించిందని మేకర్సే అఫీషియల్ గా ప్రకటించారు. తనకంటూ ఇంకా ఏ ఇమేజ్ క్రియేట్ కాని ఓ చిన్న హీరోకు ఈ ఫిగర్స్ అనేది పెద్ద విషయమే.. పెద్ద విజయమే. మరి టాక్ బావుంది కాబట్టి శని, ఆదివారాల్లో ఈ ఫిగర్స్ డబుల్ అయినా ఆశ్చర్యం లేదేమో. మొత్తంగా కిరణ్ చెప్పి మరీ హిట్టు కొట్టాడు.

Tags

Next Story