Kiran Abbavaram : దీపావళి మూవీస్ లో దూసుకుపోతున్న ‘క’

పండగ సందర్భాల్లో వచ్చే సినిమాలపై ఆడియన్స్ లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్ కూడా కలిసొస్తాయి కాబట్టి ఫ్యామిలీస్ సినిమాలకు వెళతారు. అది ఆయా చిత్రాలకు కలిసొస్తుంది. ఇంతకు ముందు లేదు కానీ.. కొన్నాళ్లుగా తెలుగులో కూడా దీపావళిని పెద్ద సీజన్ గా చూస్తున్నారు మనవాళ్లు. అందుకే ఈ యేడాది దీపావళికి పెద్ద పోటీయే ఉంది. ఈ నెల 31న విడుదలవుతోన్న చిత్రాల్లో ప్రధానంగా కనిపిస్తున్నవి.. లక్కీ భాస్కర్, క, జీబ్రా, అమరన్, భగీర. అమరన్ తమిళ్ డబ్బింగ్ మూవీ. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించడం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో సరైన ప్రమోషన్ లేదు. ఈ మూవీ 31న విడుదలవుతున్నట్టు చాలామందికి తెలియదు కూడా.
భగీరా కన్నడ సినిమా. ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన ఈ సినిమాలో శ్రీ మురళి హీరోగా నటించాడు. అతనెవరో తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. అంచేత ప్రశాంత్ నీల్ ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేస్తే తప్ప ఇక్కడ వర్కవుట్ కాదు.
ఇక దుల్కర్ సాల్మన్, మీనాక్షి చౌదరి జంటగా సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ అంతగా జనాల్లోకి వెళ్లడం లేదు అనేది నిజం. దర్శకుడు వెంకీ ఖాతాలో హిట్స్ ఉన్నా.. ఎందుకో స్టేచర్ రాలేదు. దుల్కర్ ఇక్కడ మరీ పడి చచ్చేంత క్రేజ్ లేదు. అందుకే అగ్రెసివ్ ప్రమోషన్స్ ఉంటే తప్ప స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రావు.
ఇక జీబ్రా.. సత్యదేవ్, ధనంజయ్, సునిల్, సత్య, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంతమంది వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నా.. ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ మధ్య వచ్చిన టీజర్.. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ బానే ఉన్నా.. ఈ మూవీ బాధ్యత ఇంకా ఎవరూ తీసుకోలేదు. అందుకే ఇంకా ఆడియన్స్ లోకి వెళ్లలేదు.
ఉన్నంతలో.. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ ప్రమోషన్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంపై అతను చాలా నమ్మకం పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత రిలీజ్ అవుతోన్న మూవీ కూడా కావడంతో కలిసొస్తుందనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది. దీనికి తోడు.. క మూవీపై ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కిరణ్ తను పూర్తిగా భుజాలపై మోస్తున్నాడీ చిత్రాన్ని. అన్ని ఇంటర్వ్యూస్ లోనూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది ఆడియన్స్ లో కూడా నమ్మకాన్ని పెంచుతుంది. అలా నమ్మకాన్ని పెంచడంలో మిగతా సినిమాలతో పోలిస్తే.. కిరణ్ వల్ల ‘క’ కాస్త ముందు ఉందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com