Kiran Abbavaraam : క ట్రైలర్.. కనబడేంత మంచోడు కాదు అతను

స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ను ఊరించడానికో, తమ రేంజ్ ఇదీ అని ప్రూవ్ చేసుకోవడానికో చెప్పిన టైమ్ కు అప్డేట్స్ ఇవ్వరు. కిరణ్ అబ్బవరం అనే చిన్న హీరో కూడా అదే చేశాడు. గురువారం సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ అన్నారు. తర్వాత 7 గంటలకు అని చెప్పారు. అదీ పోయింది.. చివరికి 10 గంటలకు ట్రైలర్ గ్యారెంటీ అనేశారు. బట్ మనోడి రేంజ్ కు అప్పటి వరకూ ఎవరు ఎదురుచూస్తారు. అందుకే ఇవాళ ఉదయం 10 తర్వాత ట్రైలర్ విడుదల చేశారు. సుజిత్ - సందీప్ ద్వయం డైరెక్ట్ చేసిన మూవీ ఇది. నయన్ సారిక, తన్వీ రామ్ ఫీమేల్ లీడ్ లో నటించారు. ప్యాన్ ఇండియా రిలీజ్ అంటోన్న ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
క మూవీ 1980ల నేపథ్యంలో సాగుతుంది. చుట్టూ కొండలు ఉన్న ఓ గ్రామం. ఆ గ్రామానికి పోస్ట్ మేన్ గా వచ్చిన కుర్రాడు. ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటున్న ఆ కుర్రాడికి అదే ఊరిలో ఓ అమ్మాయి నచ్చుతుంది. ప్రేమిస్తాడు. కట్ చేస్తే అతనికి ఏవో కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఎవరో తనను నిలదీస్తున్నట్టుగా కనిపిస్తుంది. 1970ల కాలంలో అతను చదివిన ఒక ఉత్తరం గురించి పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. మరోవైపు ఆ ఊరిలో అనుకోని సంఘటనలెన్నో జరుగుతుంటాయి. వాటికి ఈ పోస్ట్ మేన్ కు ఉన్న సంబంధం ఏంటీ అనేది తెరపై చూడాలి. అలాగే ముసుగు వేసుకుని అతన్ని ప్రశ్నించే ఓ పాత్ర ఓ సందర్భంలో 'పైకి కనిపించేంత మంచోడివి కాదురా నువ్వు" అని అతన్ని అంటుంది. అంటే ఈ కథలో నెగెటివ్ సైడ్ లో కూడా అతనుంటాడా.. అసలు ఈ పోస్ట్ మేన్ నేపథ్యం ఏంటీ అనేది సినిమాలోనే చూడాలి.
టేకింగ్ పరంగా చాలా బావుంది. అప్పటి యాంబియన్స్ ను బాగా క్రియేట్ చేశారు. శామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ కాబోతోందని అర్థం అవుతోంది. అన్ని పాత్రలకూ మంచి ప్రాధాన్యత కనిపిస్తోంది. ముఖ్యంగా కిరణ్ క్యారెక్టరైజేషన్ లో ఏదో మ్యాజిక్ కనిపించేలా ఉంది. ఈ మ్యాజిక్ వర్కవుట్ అయితే క ఖచ్చితంగా బాక్సాఫీస్ ను గెలుస్తుంది. కానీ ఈ ఆలస్యాల్లాంటివి పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. అది కూడా గమనిస్తే మంచిది వీళ్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com