Kaantha Movie Review : కాంత మూవీ రివ్యూ

రివ్యూ : దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని, రానా తదితరులు
ఎడిటర్ : లెవెలిన్ ఆంటోనీ గోన్సాల్వేజ్
సినిమాటోగ్రఫీ : డాని సాంన్ఛెజ్ లోపెజ్
సంగీతం : ఝాను చంతర్(పాటలు) జేక్స్ బిజోయ్(స్కోర్)
నిర్మాతలు : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్ఘీస్
దర్శకత్వం : సెల్వమణి సెల్వరాజ్
దుల్కర్ సల్మాన్ మూవీస్ అంటే మాగ్జిమం బావుంటాయి. ఆకట్టుకునే కథ, కథనం మెప్పిస్తాయి. అలాంటిది అతను ఈ సారి పీరియాడిక్ మూవీతో వచ్చాడు. మూడేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ మూవీగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
టికే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ఒక మహా నటుడు. నట చక్రవర్తి అనే బిరుదాంకితుడు. అయ్యా(సముద్రకని)గొప్ప దర్శకుడు. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో చేస్తుంటారు.కానీ ఆ ఇద్దరి మధ్య అస్సలు పడదు. స్టార్ హీరో కాబట్టి అతని కథలో వేలు పెడుతుంటాడు. కథలో మార్పులు చేస్తుంటాడు.ఇద్దరి మధ్య సయోధ్య చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సాధ్యం కాదు. అలాగే సినిమా చివరికి వరకు వస్తుంది. ఈ క్రమంలో సడెన్ గా కుమారి హత్య చేయబడుతుంది. ఆ హత్య ఎవరు చేశారు అనే కోణంలో సెకండ్ హాఫ్ సాగుతుంది. అయితే ఆమె హత్యకు కారణం దర్శకుడా, హీరోనా, ఇంకెవరైనా అనే నేపథ్యంలో కొనసాగుతుంది సినిమాలో.
ఎలా ఉంది :
పీరియాడిక్ మూవీ అంటే ఆ సెటప్, ఆ గొడవ అంతా అదే ఊహించుకుంటూ ఉంటాం. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. 1950ల నేపథ్యంలో సాగే కథనం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అద్భుమైన నటన, సెట్స్ కూడా కనిపిస్తుంది. హీరో, దర్శకుడి మధ్య సాగే ఇగో క్లాష్ మాత్రం హైలెట్ గా కనిపిస్తుంది. సినిమా ఆరంభంలోనే కథనం మొదలవుతుంది. కథ ఏంటీ అనేది తెలుస్తుంది.హీరోతో దర్శకుడి క్లాష్, దర్శకుడితో ఈగో కొనసాగుతుంది..? ఆ ఇద్దరి మధ్య అసలేం జరిగింది..? ఇద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది..? హీరోతో దర్శకుడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది అనేది అంశాలు మొత్తంగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. దర్శకుడి కెరీర్ తగ్గిన తర్వాతే హీరోతో అహం మొదలవుతుంది అనేది తెలుస్తుంది.
సెకండ్ హాఫ్ లో కుమారి హత్య మొదలైన రానా పాత్ర మాత్రం తేలిపోయింది. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయింది అనే ఆ పాత్రలో. పైగా రానా నటన కూడా తేలిపోయింది. దీంతో సెకండ్ పార్ట్ లో పాత్రల మధ్య ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ మాత్రం పూర్తిగా గాడి తప్పుతుంది. దుల్కర్, సముద్రకని పాత్రల మధ్య రియలైజేషన్ వరకు వచ్చేసరికి తేలిపోయింది. కానీ ఆ ఇద్దరు మధ్యలో అద్భుతమైన నటన మాత్రం మెప్పిస్తుంది. ఈగోస్ ఉన్న రెండు పాత్రల మధ్య గొప్ప నటనను చూపిస్తుంది. కుమారి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కూడా ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో ఉన్న బిగి సెకండ్ హాఫ్ లో తేలిపోతుంది. పెద్దగా ఆకట్టుకోలేకపోయేలా కనిపించలేదు. ఇతర పాత్రలు పెద్దగా మెప్పించలేకపోయాయి. దుల్కర్ గతం సినిమాలతో పోలిస్తే నటన పరంగా పీక్స్ లో కనిపించలేదు కానీ కథనం మాత్రం తేలిపోయింది అనే చెప్పాలి. సముద్రకని నటన గొప్పగా కనిపిస్తుంది. అతని పాత్రలో ఎండింగ్ కూడా ఊహించేదే కావడం కొంత మైనస్ గా మారుతుంది.
టెక్కికల్ గా బాగా ఉంది. సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా కనిపిస్తుంది. ఆ కాలం నాటి సన్నివేశాలను రీ క్రియేట్ చేసిన విధానం బావుంది. ఎడిటింగ్ పరంగా అనేక లోపాలు ఉన్నాయి. డైలాగ్స్ చాలా బావున్నాయి. సెట్ వర్క్స్ కూడా బావుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ మెప్పించినా కథనంలో మాత్రం మైనస్ లు కనిపిస్తాయి. ఓవరాల్ గా చూస్తే నటన పరంగా గొప్పగా అనిపించే చిత్రంగానే చెప్పాలి.
ఫైనల్ గా : ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కాంత
రేటింగ్ : 2.5/5
⦁ బాబురావు. కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

