వంటలక్క వెండితెరపైకి ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో..

వంటలక్క వెండితెరపైకి ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో..
బుల్లి తెర తారలు వెండి తెరపై కూడా వెలిగి పోతున్నారు. తాజాగా కార్తీక దీపం ఫేమ్.. వంటలక్క

బుల్లి తెర తారలు వెండి తెరపై కూడా వెలిగి పోతున్నారు. తాజాగా కార్తీక దీపం ఫేమ్.. వంటలక్క అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. ప్రేమీ విశ్వనాథ్ తన నటనతో బుల్లి తెర ప్రేక్షకుల మనసును దోచింది. చిన్న పెద్దా తేడాలేకుండా అందర్నీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది ఆ సీరియల్. మరే సీరియల్‌కి కూడా అంత డిమాండ్ లేదు.

టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతున్న వంటలక్కకి రామ్ పోతినేని సినిమాలో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో వంటలక్కకు ఓ మంచి రోల్ ఆఫర్ చేశారట దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు కూడా బిగ్ స్క్రీన్‌పై నటించే అవకాశం వచ్చినా ఓకే చెప్పలేదు.

ఆలోచించి అడుకేస్తున్న ప్రేమీ విశ్వనాథ్ చిన్న పాత్ర అయినా ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోవాలని కోరుకుంటోంది. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తూ లింగుస్వామి చెప్పిన పాత్ర నచ్చడంతో ఆ సినిమాలో నటించడానికి ఓకే చేసింది.

Tags

Read MoreRead Less
Next Story