Kaikala Birthday : 87లోకి కైకాల.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన మెగాస్టార్..

Kaikala Birthday : టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కదలలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఆయన 87వ పుట్టినరోజును జరుపుకుంటుండడంతో మెగాస్టార్ దగ్గరుండి కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరు తన ఆఫిషియల్ ట్విట్టర్‌లో ఈ కేక్ కటింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కైకాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. కూర్చోలేని.. కనీసం కదలలేని స్థితిలో ఉన్నారు. బైడ్ పైన ఆయనకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్శి లో రీసెంట్‌గా నటించారు.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com