Kaithi Remake : మలేసియాలో రీమేక్ అవుతోన్న ఖైదీ

Kaithi Remake :  మలేసియాలో రీమేక్ అవుతోన్న ఖైదీ
X

లోకేష్ కనకరాజ్ క్రియేట్ చేసిన విజువల్ వండర్స్ లో చాలా ఎక్కువమందికి ఇష్టమైన మూవీ ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ ఒకే రాత్రిలో పూర్తయ్యే కథ. తర్వాత లోకేష్ సినీవర్స్ కు బీజం వేసింది కూడా ఈ మూవీయే. దేశవ్యాప్తంగా ఈ మూవీకి మంచి అభిమానులున్నారు. అందుకే ఖైదీ సీక్వెల్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ మూవీ తాజాగా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. మన సినిమాలు మహా అయితే ఇతర భారతీయ భాషల్లో రీమేక్ అవుతాయి. ఎప్పుడో కానీ వేరే దేశాల్లో రీమేక్ కావు. ముఖ్యంగా మలేసియా లాంటి దేశాల్లో. బట్ ఈ ఖైదీ మూవీ మలేసియాలో రీమేక్ అవుతోంది. విశేషం ఏంటంటే.. మలేసియాలో చాలామంది తమిళులు ఉంటారు. వారంతా ఆల్రెడీ ఈ మూవీ చూసే ఉంటారు. అయినా రీమేక్ అంటే ఖైదీ క్రేజ్ ఆ దేశంలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ మలే మూవీ నుంచి ఖైదీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇదే అర్థం వారి భాషలో కూడా వచ్చేలాగా ఈ చిత్రానికి అక్కడ ‘బందువన్’అనే టైటిల్ పెట్టారు. అంటే ఖైదీ అనే అర్థం.ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రకటించారు అక్కడి మేకర్స్.

క్రోల్ ఆజ్రీ డైరెక్ట్ చేస్తోన్న ఈ బందువన్ లో ఆరోజ్ అజిజ్ హీరోగా నటిస్తున్నాడు. రోశ్యామ్ నార్, అఫ్ డ్లిన్ షౌకీ,ఫాద్లీ మాసూట్, అమిర్ నఫిస్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. మొత్తంగా ఓ తమిళ్ మూవీ మలేసియాలో రీమేక్ కావడం వెరీ రేర్ అనే చెప్పుకోవచ్చు. కోలీవుడ్ కు మలేసియాలోనూ తిరుగులేని మార్కెట్ ఉంది. రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి హీరోస్ మూవీస్ కు అక్కడ భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటి చోట ఈ మూవీ రీమేక్ అవుతుందంటే ఖైదీ మేకర్స్ కు గర్వ కారణమే అని చెప్పాలి.

Tags

Next Story