Kajal Agarwal: చిన్నా..నీ చిలిపి అల్లరి గుర్తుపెట్టుకుంటారా కన్నా..: కాజల్ పోస్ట్ వైరల్

Kajal Agarwal: నీల్ నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం ఎంత త్వరగా గడిచిపోయింది. అమ్మగా నిన్ను పెంచే విషయంలో నేనెంతో భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించగలనా లేదా అని కంగారు పడ్డాను.
కానీ ప్రతి రోజు నాకు ఓ కొత్త పాఠం నేర్పిస్తున్నావు. నేనెలా ఉండాలో చెప్పకనే చెబుతున్నావు. నాకు ఎన్ని పనులు ఉన్నా నీకోసం సమయం కేటాయిస్తూనే ఉంటాను. నీపై శ్రద్ధ చూపడంలో రాజీ పడను. నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను.
ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా నేను పొందే ఆనందం ముందు అది చిన్నదే అనిపిస్తుంది. నువు రాత్రి పూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము.
నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మై లవ్.. మై నీల్ అని రాసుకొచ్చింది తన కొడుకు గురించి కాజల్. ఈ పోస్టుకు కుమారుడు నీల్ ఫోటోను జత చేసింది. ఆమె చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com