Kajal Agarwal : భారతీయుడు 2 షూటింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది : కాజల్ అగర్వాల్

Kajal Agarwal : భారతీయుడు 2 షూటింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది : కాజల్ అగర్వాల్
Kajal Agarwal : కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సినిమాకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు.

Kajal Agarwal : కమల్ హాసన్ అభిమానులకు గుడ్‌న్యూజ్.. కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సినిమాకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. ఆమె ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ మధ్య ఓ ఇంటర్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'సెప్టింబర్ 13 నుంచి భారతీయుడు 2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నా' అని చెప్పారు.

1996లో శంకర్ దరర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 26 ఏళ్ల తరువాత మళ్లీ ఆ మూవీ సీక్వెల్ 'భారతీయుడు 2' గా మనముందుకు రానుంది. 2020లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావలసిఉంది. అయితే సెట్స్‌లో అనుకోని ప్రమాదం.. కోవిడ, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధల కారణంగా ఆగిపోయింది. కమల్ కూడా విక్రమ్ సినిమాతో అప్పుడు బిజీ ఉండడం వల్ల కుదరలేదు. ఈ ఏడాదిలో భారతీయుడు 2 షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story