Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ జంటకు బేబీ బాయ్..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ జంటకు బేబీ బాయ్..
X
Kajal Aggarwal: కాజల్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.

Kajal Aggarwal: ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది కాజల్ అగర్వాల్. సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే కాజల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిప్స్‌ను షేర్ చేస్తుంది. తాజాగా కాజల్ బేబీ బాయ్‌కు జన్మనిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

కాజల్.. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. లాక్‌డౌన్ సమయం కావడంతో చాలా తక్కువమంది సమక్షంలో కాజల్, గౌతమ్‌ల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగే సమయానికి కాజల్ పలు సినిమాలకు కమిట్ అయ్యింది. పెళ్లయిన తర్వాత కూడా కొన్నాళ్లు షూటింగ్స్‌లో పాల్గొంది. కానీ ఎక్కువరోజులు లేదు. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ అని రూమర్స్ మొదలయ్యాయి.

కాజల్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. ఇక కొన్నాళ్లకు కాజల్ కూడా బేబీ బంప్‌తో ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. మంగళవారం కాజల్ బేబీ బాయ్‌కు జన్మనిచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Tags

Next Story