Kajal Aggarwal : కొత్త ఇంట్లోకి ప్రవేశించిన 'భగవంత్ కేసరి' హీరోయిన్

Kajal Aggarwal : కొత్త ఇంట్లోకి ప్రవేశించిన భగవంత్ కేసరి హీరోయిన్
X
కొత్తింటి గృహ ప్రవేశం ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ ఇంటి గృహ ప్రవేశం సందర్భంగా తన భర్త గౌతమ్, కొడుకు నీల్ తో ఉన్న కొన్ని ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో కాజల్ షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ వారం ప్రారంభంలో తమ గృహ ప్రవేశ పూజ చేశామని కాజల్ ఈ సందర్భంగా తెలిపింది. తన ఇల్లు ఇప్పుడు ప్రేమతో నిండి ఉంది.. ఇది తమకు ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఇక కాజల్ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె తన భర్తతో పూజల్లో పాల్గొన్నట్టు, కొడుకు నీల్ ను ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నట్టు ఉన్నాయి. ఈ సమయంలో కాజల్ తెలుపు రంగు దుపట్టా, పసుపు పలాజోలో.. పాస్టెల్ పింక్ కుర్తా ధరించి ఉంది. ఆమెతో పాటు ఉన్న నీల్ కూడా అదే గులాబీ రంగులో కుర్తా ధరించి.. క్యూట్ గా కనిపించాడు.

ఈ ఫొటోలను చూస్తుంటే.. బాగా సంపాదించిన తృప్తి.. దాని వల్ల వచ్చిన ఫలాలతో కాజల్ సంతృప్తిగా ఉన్నట్టు, అత్యంత ఆనంద పారవశ్యంతో తేలుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సంతోషకరమైన సందర్భంగా కాజల్ తన కుటుంబసభ్యులతోనూ మమేకమైంది.

ఇక కాజల్, గౌతమ్ కిచ్లుకు వివాహమై 3సంవత్సరాలు దాటింది. ఆమె చివరిసారిగా నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి'లో కనిపించింది. ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న 'ఇండియన్ 2'లోనూ నటించనుంది. ఇందులో నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది.


Tags

Next Story