Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ వర్కవుట్స్.. వీడియో వైరల్..

Kajal Aggarwal (tv5news.in)
X

Kajal Aggarwal (tv5news.in)

Kajal Aggarwal: ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తోంది కాజల్.

Kajal Aggarwal: టాలీవుడ్‌లో చందమామగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. దాదాపు పది సంవత్సరాలపైనే ప్రేక్షకులను తన నటనతో, గ్లామర్‌తో మెప్పించిన కాజల్.. గతేడాది తన ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఇక కొంతకాలం క్రితం కాజల్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భర్త గౌతమ్.. సోషల్ మీడియాలో ప్రకటించాడు. తాజాగా డెలివరీ డేట్ దగ్గర పడుతున్నా కూడా కాజల్ హెవీ వర్కవుట్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మామూలుగా నటీమణులు పెళ్లి అయిన తర్వాత కెరీర్‌ను పక్కన పెట్టేసి పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోతారు. కొందరు మాత్రమే పెళ్లయినా కూడా కెరీర్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తారు. అయితే పెళ్లయ్యే సమయానికి కాజల్ చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నా.. ఒకటి తర్వాత ఒకటిగా వాటిని వదిలేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తోంది కాజల్.


'నేను నా జీవితం మొత్తం వర్కవుట్స్ చేస్తూ, యాక్టివ్‌గా ఉండడానికే ప్రయత్నించాను. ప్రెగ్నెన్సీ అనేది చాలా భిన్నమైన అనుభూతి. ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు లేని మహిళలందరూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేసేలా ప్రోత్సహించబడాలి.' అంటూ కాజల్ తాను వర్కవుట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Tags

Next Story