Kajal Aggarwal: ప్రియమైన శ్రీవారికి ప్రేమతో.. రాబోయే రోజుల్లో చాలా మార్పులు: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుపై ప్రేమను కురిపించింది. తన ప్రేమనంతా అక్షరాల్లో పొందుపరిచి ఓ లేఖను రాసింది. తన మీద భర్త చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు ఇకపై తమ బిడ్డపై కూడా ఉంటాయని నమ్ముతున్నాను అంటూ గర్భధారణ సమయంలో ఎల్లప్పుడూ తన పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటున్న భర్తను, తండ్రి కాబోయే గౌతమ్ కిచ్లును ప్రశంసలతో ముంచెత్తింది.
కాజల్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ తరచూ ఫోటో షూట్ లు చేస్తుంది. అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంది. ఇప్పుడు కాబోయే తండ్రి గౌతమ్ తనకు గర్భధారణ సమయంలో ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో వివరించింది.
కష్ట సమయాల్లో గౌతమ్ తన పక్కన ఎలా ఉన్నాడో రాసింది. "ప్రియమైన శ్రీవారికి.. ఒక అమ్మాయి భర్తలో కోరుకునే గొప్ప లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. తండ్రి కాబోతున్నందుకు ధన్యవాదాలు. నాకు 'ఉదయం' అనారోగ్యంగా ఉన్నప్పుడు నా పక్కనే నిలబడి నన్ను చూసుకున్నావు.
దాదాపు ప్రతి రాత్రి నాతో పాటు మేల్కొనే ఉంటున్నావు. గర్భం ధరించిన సమయంలో నిద్ర సరిగా పట్టదు. నేను నిద్రించడానికి అత్యంత సౌకర్యవంతమైన ప్రదేశం కాబట్టి వారాలపాటు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. మన స్వీట్ బేబీ వచ్చే ముందు, మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో, మీరు అద్భుతమైన తండ్రి అవుతారని ఆశిస్తున్నాను! "
గౌతమ్ ని తండ్రిగా ప్రశంసిస్తూ.., "గత 8 నెలల్లో, మీరు అత్యంత ప్రేమగల నాన్నగా మారడం నేను చూశాను. మనకు పుట్టబోయే బేబీతో మీరు ఎంత ప్రేమలో ఉన్నారో.. మీరు ఇప్పటికే నాపట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో నాకు తెలుసు- మన బిడ్డను అధికంగా ప్రేమించే తండ్రిని కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంది తండ్రులకు మీరు రోల్ మోడల్ అవుతారనుకుంటున్నాను.
అయితే బేబీ వచ్చిన తరువాత మునుపటి మాదిరిగా మన జీవితం ఉండబోదని కాజల్ పేర్కొంది. ఇప్పుడు మనకు ఉన్నంత ఒంటరి సమయం ఉండదు- మనం ప్రతి వీకెండ్ లో సినిమాలకు వెళ్లలేము. సరిగా నిద్ర ఉండదు. అర్ధరాత్రి వరకు మేలుకొని టీవీషోలు, వెబ్ సిరీస్ లు చూడలేము. లేట్ నైట్ పార్టీలకు వెళ్లలేము. కానీ మన చిన్నారిని చూసి మన హృదయం ఆనందంతో నిండిపోతుంది అని ఆమె లెటర్ లో రాసుకొచ్చింది.
ఇది మన జీవితంలో చాలా విలువైన సమయం అవుతుంది. చాలా విషయాలు మారతాయి కానీ ఒకటి మాత్రం అలాగే ఉంటుంది. అదే నేను ఎప్పటికీ నిన్ను చాలా ప్రేమిస్తుంటాను. కఠిన సమయాల్లో మీరు ఎప్పుడూ నా పక్కన ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అని భర్త గౌతమ్ కిచ్లుని ప్రశంసిస్తూ కాజల్ లేఖ రాసింది.
కాగా, కాజల్ చివరిగా గత ఏడాది తమిళ చిత్రం హే సినామికలో కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

