Kajal Aggarwal: అప్పుడే కొడుకు పేరును రివీల్ చేసిన కాజల్ భర్త..

Kajal Aggarwal: సీనియర్ నటి కాజల్ అగర్వాల్ మంగళవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ ఫేవరెట్ హీరోయిన్ కాజల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక తమ కొడుకు గురించి గౌతమ్ కిచ్లూ మొదటిసారిగా పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఈ పోస్ట్‌లో తమ కొడుకు పేరేంటో కూడా చెప్పేశాడు. ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి విష్ చేసింది కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ కలిసి తమ కొడుకు పేరును 'నీల్ కిచ్లూ'గా ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టాడు గౌతమ్. 'మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మాకు ప్రేమ, ఆశీస్సులు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అని ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు గౌతమ్ కిచ్లూ. అయితే ఈ పోస్ట్‌ను తన స్టోరీలో పెట్టిన నిషా.. తన అనుభవాన్ని ఫాలోవర్స్‌తో పంచుకుంది.
'నిన్న ఉదయం మాకు చాలా పర్ఫెక్ట్. మేము మా ప్రపంచాన్ని ఇంకా అందంగా మార్చే వ్యక్తిని మా జీవితాల్లోకి ఆహ్వానించాం. తన నవ్వు, కళ్లు మా రోజును ఇంకా కాంతివంతంగా మార్చేశాయి. నీల్ కిచ్లూ, నువ్వు మా ప్రపంచంలోకి రావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.' అంటూ తన సంతోషాన్ని మాటల్లో వివరించింది నిషా అగర్వాల్. ఇక కాజల్ అభిమానులంతా తన కొడుకు ఫోటోను ఎప్పుడు చూపిస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com