Kajal Aggarwal: సినిమాలకు కాజల్ గుడ్ బై ?

Kajal Aggarwal: ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇక పై సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకి ఈ విషయాన్ని చెప్పినట్టుగా సమాచారం.
కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి అయ్యాక సినిమాలకి దూరం అయింది. ఇక తల్లి అయ్యాక పూర్తిగా కుటుంబ బాధ్యతలకే పరిమితం అయింది. తన బిడ్డను దృష్టిలో పెట్టుకొని సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా కాజల్ ఇండస్ట్రీ వచ్చి 18 ఏళ్లు కావస్తోంది. హిందీలో 2004లోనే ఫస్ట్ సినిమా చేసినా.. తెలుగులో మాత్రం 2007లో కళ్యాణ్ రామ్ సరసన 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరవాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక 2020 అక్టోబర్ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com