Kajal Aggarwal : ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్ .. ?

Kajal Aggarwal : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది.
మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే సినిమా సింగిల్స్, టీజర్, ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో చిరు సరసన నటిస్తోన్న కాజల్‌ని ట్రైలర్‌లో ఎక్కడ కూడా చూపించలేదు.. గెస్ట్ రోల్ అయిన పూజా హెగ్డేని అక్కడక్కడైనా చూపించారు.
అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మేకర్స్ కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో కరోనా రావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ షూటింగ్ టైమ్ మొదలయ్యే సరికి కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో షూటింగ్‌కి రానాని కాజల్ తప్పించుకుందని టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో కాజల్ నటించిన కొన్ని సీన్స్‌ను సినిమా నుంచి తొలగించారని వార్తలొస్తున్నాయి. దీనిపైన క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.. చిరంజీవి 152వ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com