Kajal Aggarwal: మదర్స్ డే సందర్భంగా కొడుకు ఫోటోతో కాజల్ స్పెషల్ పోస్ట్ షేర్..

Kajal Aggarwal: మదర్స్ డే సందర్భంగా కొడుకు ఫోటోతో కాజల్ స్పెషల్ పోస్ట్ షేర్..
Kajal Aggarwal: మదర్స్ డే సందర్భంగా తన కొడుకు నీల్‌కు ఓ స్పెషల్ నోట్ రాసింది కాజల్.

Kajal Aggarwal: 10 ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కాజల్ అగర్వాల్. ఎన్నో సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది.. ఎందరో స్టార్ హీరోలతో జోడీకట్టింది. కొన్నాళ్ల క్రితం గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్‌తో బిజీ అయిపోయింది కాజల్. తను ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది కూడా. కాజల్, గౌతమ్ కలిసి తమ కొడుకుకు నీల్ అని పేరు పెట్టుకున్నారు. అయితే నీల్ పుట్టిన తర్వాత మొదటిసారి తన ఫోటోను సోషల్ మీడియలో షేర్ చేసింది కాజల్.

మదర్స్ డే సందర్భంగా తన కొడుకు నీల్‌కు ఓ స్పెషల్ నోట్ రాసింది కాజల్. 'ప్రియమైన నీల్. నువ్వు నాకు ఇప్పటికీ, ఎప్పటికీ ఎంత ముఖ్యమో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నా మొదటి బిడ్డవి. అమ్మ అవ్వడం అంటే ఎలా ఉంటుందో నువ్వే నాకు నేర్పించావు. నా హృదయంలోని ఓ చిన్న భాగం నా శరీరాన్ని దాటి బయటికి రాగలదు అని చూపించావు. నువ్వు ఇన్ని నేర్పించిన తర్వాత కూడా నేను నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది.'

'నువ్వు ధృడంగా పెరగాలని, నలుగురి గురించి ఆలోచించే మనసు నీకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ నిరాశపరిచేలా ఉండకూడదు అని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇలాంటి వ్యక్తిత్వం నీలో నేను చూస్తున్నాను. నువ్వు నావాడివి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది.' అని కాజల్ తన బిడ్డ నీల్‌ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ చాలామంది మనసుకు హత్తుకుపోయేలా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story