Kajol: అభిమానులంటే అంత చులకనా.. 'కాజోల్' కేక్ కటింగ్‌పై నెటిజన్స్ ఫైర్

Kajol: తన 47 వ పుట్టినరోజు నాడు కాజోల్ మాస్క్ ధరించి బయటకు వచ్చి అభిమానులు తెచ్చిన కేక్ కట్ చేశారు. అయితే, వైరల్ అయిన ఈ వీడియోలో ఆమె వైఖరిని చూసి నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.
బాలీవుడ్ నటి కాజోల్ గురువారం తన 47 వ పుట్టినరోజును జరుపుకుంది. భారీ ఫ్యాన్స్‌ని కలిగి ఉన్న ఈ నటిని, ఆమె ఇంటి వెలుపల అభిమానుల బృందం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చింది. కోవిడ్ భద్రతా నియమాలను అనుసరించి కాజోల్ మాస్క్ ధరించి బయటకు వచ్చి అభిమానులు తెచ్చిన కేక్‌ను కట్ చేశారు.
కాజోల్ వారి పట్ల అనుసరించిన విధానం అభిమానులకు నచ్చలేదు. ఆమె పెద్ద సెలబ్రిటీ కాబట్టి యాటిట్యూడ్ చూపుతోందని చాలామంది భావిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా రాసుకొచ్చారు. "ఆమె అభిమానులు ఎంతో అభిమానంతో తన కోసం కేక్ తెచ్చారని సంతోషంగా లేదు .. పేదలు తన సమయాన్ని వృధా చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
"డబ్బు, ప్రయత్నం, సమయం కనీసం పట్టించుకోని వ్యక్తుల కోసం ఎందుకు వృధా చేయడం" అని కొందరు ట్రోల్ చేయగా "అక్కడే ఉన్న పిల్లలకు ఆమె తన చేతులతో కేక్ ముక్కను తినిపించవచ్చు'' కదా అని మరికొందరు.. ఈ సెలెబ్రెటి అభిమానులను ఏమాత్రం పట్టించుకోదు" అని మరొకరు ట్రోల్ చేశారు.
కాజోల్ పుట్టినరోజు నాడు, భర్త అజయ్ దేవగన్ ప్రేమపూర్వకమైన నోట్‌ను రాసి అందమైన చిత్రంతో పోస్ట్ చేశారు. "నువ్వు నా జీవితంలో ప్రవేశించి ఆనందాన్ని పంచావు.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన కాజోల్'' అని రాశారు.
అజయ్ దేవగన్, కాజోల్ అనేక చిత్రాలలో కలిసి పని చేసారు. వారి మొదటి చిత్రం హల్చుల్ (1995) లో నటిస్తున్నప్పుడు ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చివరిసారిగా 2020 లో తెరపై కలిసి నటించిన చిత్రం 'తన్‌హాజీ: ది అన్సంగ్ వారియర్' లో కనిపించారు. వారికి 22 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది మరియు 17 ఏళ్ల నైసా మరియు 10 ఏళ్ల యుగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాజోల్ చివరిగా త్రిభంగా చిత్రంలో కనిపించింది. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో బయోపిక్ శశి లలిత, వేలైల్లా పట్టాధారి 3 మరియు షారుఖ్ సరసన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com